మరింత తగ్గిన బంగారం ధర!

అంతర్జాతీయంగానూ, దేశీయ మార్కెట్లలోనూ గురువారం కూడా బంగారం ధరలు తగ్గాయి.

Update: 2019-09-12 04:53 GMT

గ్లోబల్ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతో బంగారం ధర ఈరోజూ పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో గరువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయలు తగ్గి 39,660గా నిలిచింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా 110రూపాయల తగ్గుదలతో 36,340రూపాయల కు చేరింది. ఇక మార్కెట్ లో వెండి ధర మరింత పతనమైంది. కేజీ వెండి ధర ఏకంగా 1,900 రూపాయల తగ్గుదలతో 51,300రూపాయలకు దిగిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ క్షీణించడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. . విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి రూ.38,300కు పడిపోయింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయల తగ్గుదలతో 37,100రూపాయలకు తగ్గింది. ఇక కేజీ వెండి ధర ఏకంగా రూ.1,900 పతనమైంది. రూ.51,300కు పడిపోయింది.

గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. పసిడి ధర ఔన్స్‌కు 0.17 శాతం తగ్గుదలతో 1,500.55 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.15 శాతం తగ్గుదలతో 18.14 డాలర్లకు దిగొచ్చింది.



Tags:    

Similar News