భారీగా తగ్గిన బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి ధరలు

ఈరోజు (11-12-2019)బంగారం ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు ష్వల్పంగా పైకెగశాయి.

Update: 2019-12-11 02:32 GMT

ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. మరోవైపు వెండిధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 320   రూపాయలు తగ్గి  39,210 రూపాయల వద్దకు దిగి వచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 180   రూపాయలు తగ్గి  35,940 రూపాయల వద్దకు చేరింది. అయితే, వెండి ధరలు ఈరోజు కేజీకి 90 రూపాయలు పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 47,490 వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,210 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 35,940 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పడిపోయాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 200 రూపాయలు తగ్గి  37,900 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 200  రూపాయలు తగ్గి 36,700 రూపాయల వద్దఉంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 90 రూపాయల పెరుగుదల  నమోదు చేసింది. దీంతో వెండి కేజీకి 47,490 రూపాయల వద్దకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 11.12.2019 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మర్పులకుగురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Tags:    

Similar News