Gold Rates Today 03-11-2019: మళ్లీ పెరిగిన బంగారం.. భారీగా పతనమైన వెండి

దేశీయ మార్కెట్లలో పసిడి ధరలు ఈరోజు (03-11-2019) పైకెగశాయి.అయితే వెండి ధరలు కేజీకి 9500 రూపాయల మేర రికార్డ్ పతనాన్ని చూశాయి.

Update: 2019-11-03 01:34 GMT

ఈరోజు బంగారం ధరలు భారీస్థాయిలో పెరిగాయి. 03.11.2019 ఆదివారం పది గ్రాముల బంగారం ధర శనివారంతో పోలిస్తే ఒక్కసారిగా 340 రూపాయల వరకూ పెరిగింది. కాగా, వెండి ధరలు రెండోరోజూ భారీగా తగ్గాయి. వెండి ధరలు ఆదివారం కేజీకి ఏకంగా 9500 రూపాయలు తగ్గాయి. ఈమధ్యకాలంలో వెండి ధరల్లో భారీ పతనం ఇది.

ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 340 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 40,410 రూపాయలకు ఎగసింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 340 రూపాయలు పెరిగింది. దీంతో 37,050 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక వెండిధరలు కేజీకి 9500 రూపాయలు తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 39,000 రూపాయలకు దిగివచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,430రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 37,050 రూపాయలకు పెరిగాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. స్థిరంగా ఉంది. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయాలు పెరిగి 39,050 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 350 రూపాయల మేర పెరిగి 37,850 రూపాయలకు ఎగసింది. ఇక వెండి ధర ఇక్కడ కూడా కేజీకి 9500 రూపాయలు తగ్గింది. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 39,000 రూపాయలకు దిగివచ్చింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 03.11.2019 ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది

Tags:    

Similar News