Gold Rates Today: అమ్మో! మళ్లీ 40 వేలకు చేరువలోకి బంగారం.. స్థిరంగా వెండి!

Update: 2019-10-10 02:33 GMT

బంగారం ధరలు భారీగా పెరిగాయి. మళ్లీ 40 వేలరూపాయల చేరువలోకి బంగారం చేరుకుంది. గురువారం దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయలు పెరిగి 39,980 కి చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 360 రూపాయలు పెరిగింది. దీంతో 36,650 రూపాయలకు ఎగబాకింది.

ఇక వెండి ధర మార్పులేదు. కేజీ వెండి ధర 48,500 రూపాయల వద్ద నిలకడగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,980, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,650 రూపాయలుగానూ ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు పెరిగో 38,500 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర 400 రూపాయల వరకూ పెరిగి 37,450 రూపాయలకు ఎగబాకింది. ఇక కేజీ వెండి ధర మార్పులు లేకుండా 48,500 రూపాయలవద్ద నిలిచింది.


Tags:    

Similar News