Gold Rates Today: కొద్దిగా కిందికి బంగారం.. కొంచెం పైకి వెండి !

హైదరాబాద్ లో బంగారం ధరలు రెండో రోజూ స్వల్పంగా తగ్గాయి. కాగా దిల్లీలో కొంచెం పెరిగాయి. వెండి ధర కొద్దిగా పెరిగింది.

Update: 2019-09-28 03:19 GMT

బంగారం ధరలు రెండో రోజూ స్వల్పంగా తగ్గాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు తగ్గడంతో 39,240 దగ్గర ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయలు తగ్గి 35,960 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కొంచెం పైకి ఎక్కింది. కేజీ వెండి ధర 25 రూపాయలు పెరిగి 50,075 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నం లలో కూడా ఇదే పరిస్థితి ఉంది.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 150 రూపాయలు పెరిగింది. ఇక్కడ 38,100 రూపాయలుగా బంగారం ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 150 రూపాయలు తగ్గి 36,900 రూపాయల వద్ద నిలిచింది. కేజీ వెండి ధర 25 రూపాయలు పెరిగి 50,075 రూపాయలుగా ఉంది.

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. 0.78 శాతం తగ్గి 1,503.45 డాలర్లుగా ఉంది. ఇక వెండిధర కూడా ఔన్స్ కు 1.78 శాతం తగ్గి 17.59 డాలర్లకు చేరింది.


Tags:    

Similar News