Gold Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. వెండి ధరలు పెరిగాయి!

Update: 2019-10-15 03:49 GMT

 రెండురోజులు కొద్దిగా పెరిగిన బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తాగ్గాయి. మంగళవారం వారం దేశీయంగా బంగారం ధరలు కొద్దిగా దిగివచ్చాయి. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 70 రూపాయలు తగ్గి 39,700 రూపాయలుగా ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయలు తగ్గి  36,400 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరమాత్రం కేజీకి 100 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,650 రూపాయలకు చేరుకోగా, విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,700, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,400 రూపాయలుగానూ ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయలు తగ్గి  38,400 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 10 రూపాయలు తగ్గి 37,200 రూపాయలకు చేరింది. ఇక కేజీ వెండి ధర 100 రూపాయలు పెరిగి  48,650 రూపాయలవద్దకు చేరుకుంది.


Tags:    

Similar News