Gold Rates Today 20.10.2019: స్వల్పంగా తగ్గిన బంగారం..స్థిరంగా వెండి!

నిన్న కొద్దిగా పెరిగిన బంగారం ధర ఈరోజు అదే మేరకు తగ్గుదల నమోదు చేసింది.20.10.2019 ఆదివారం బంగారం పది గ్రాములకు 20 రూపాయలు తగ్గింది.

Update: 2019-10-20 00:44 GMT

నిన్న కొద్దిగా పెరిగిన బంగారం ధర ఈరోజు అదే మేరకు తగ్గుదల  నమోదు చేసింది.20.10.2019 ఆదివారం బంగారం పది గ్రాములకు 20 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల బంగారం ధర సరిగ్గా 40 వేల రూపాయల మార్కు వద్దకు వచ్చి నిలిచింది. శనివారం పెరుగుదలను నమోదు చేసిన  వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి.

ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 20 రూపాయలు తగ్గి, 40,000 రూపాయలైంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 20 రూపాయలు తగ్గింది. దీంతో 36,660 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర శనివారం ధరల దగ్గరే స్థిరంగా ఉన్నాయి.  దీంతో హైదరాబాద్ లో ఆదివారం కేజీ వెండి ధర 48,000 రూపాయల వద్దనే  నిలిచింది.  విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,000 , 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,660 రూపాయలుగానూ ఉన్నాయి

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాముల ధర స్థిరంగా ఉంది. నిన్నటి 38,650 రూపాయల వద్ద 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా స్థిరంగా ఉంది. దీంతో 37,450 రూపాయల వద్ద నిలకడగా ఉంది. ఇక వెండి ధర కూడా ఎటువంటి మార్పులకూ గురవలేదు.  దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 48,000 రూపాయలు వద్ద నిలిచింది. 

అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


Tags:    

Similar News