క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్...

క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఆయా బ్యాంకులు షాక్ ఇవ్వనున్నాయి.

Update: 2020-04-28 09:13 GMT
Representational Image

క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఆయా బ్యాంకులు షాక్ ఇవ్వనున్నాయి. క్రెడిట్ కార్డుల లిమిట్ ను తగ్గించనున్నాయి. దేశంలో లాక్ డౌన్ అమలుచేస్తున్న కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మారిటోరియం ఆప్షన్ ను ఎంచున్న వినియోగదారులకు వారి క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గించనున్నారు. దేశంలో కరోనాను తరిమికొట్టేందుకు కేంద్రం అమలు చేసిన లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు, కార్యాలయాన్ని ఎక్కడికక్కడ మూతపడ్డాయి. దీంతో ఉద్యోగులెవరూ తమ కార్యాలయాలకు వెళ్లకుండా ఇండ్లవద్దే ఉంటున్నారు. కాగా వారికి రావలసిన వేతనం రాకపోవడంతో చాలా మంది క్రెడిట్ కార్డుల బిల్లులు, పర్సనల్ లోన్ ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న RBI మూడునెలలు బిల్లును మారిటోరియం చేసుకునే వెసులుబాటును కల్పించింది.

ఇక ఈ ఆప్షన్ ను ఎంచుకోవడం వలన వినియోగదారుల క్రెడిట్ కార్డ్ లిమిట్ ఏకంగా 80% తగ్గిపోయిందని ఆరోపనుల వస్తున్నాయి. అంటే క్రెడిట్ కార్డులో రూ.2,00,000 లిమిట్ ఉంటే అది కాస్తా రూ.40,000 వరకు తగ్గిపోయింది. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కారణంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. అందుకే ఆర్‌బీఐ ఈ మారటోరియం ఆప్షన్‌ను తెరపైకి తీసుకువచ్చింది. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు ఈ ఆప్షన్ ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇక ఈ మారటోరియం ఎంచుకోవడం వలన వినియోగదారులను నష్టాలే అధికంగా ఉన్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు.  


Tags:    

Similar News