రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ పదవి నుంచి తప్పుకున్న అనిల్ అంబానీ

Update: 2019-11-16 15:31 GMT
అనిల్ అంబానీ

రిలయన్స్‌ కమ్యూనియేషన్స్‌ ఆర్ కామ్‌ డైరెక్టర్ పదవి నుంచి అనిల్‌ అంబానీ తప్పుకున్నారు. ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. అనిల్‌ అంబానీతో పాటు నలుగురు డైరెక్టర్లు విరానీ, రైనా కరణి, మంజరి కాకర్‌, సురేశ్‌ రంగాచార్‌ లు కూడా రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను కంపెనీలోని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పరిశీలనకు పంపినట్టు తెలుస్తోంది.

భారీ నష్టాలు, అప్పులు రిలయన్స్‌ కమ్యూనియేషన్‌ను కోలుకోకుండా చేశాయి. బకాయిలు చెల్లించలేక తన మొబైల్ సేవలను కూడా నిలిపివేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌కామ్‌ దివాలా తీసే పరిస్థితులకు చేరువైంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ బకాయిల కేటాయింపుల తర్వాత కంపెనీ నష్టాలు 30 వేల 142 కోట్లకు చేరుకున్నాయి. ఇటు ఐబీసీ నేతృత్వంలో దివాలా ప్రక్రియ ద్వారా ఆర్ కామ్‌ ఆస్తులను కొనుగోలు చేయాలని రిలయన్స్ జియో చూస్తోందని తెలుస్తోంది.



Tags:    

Similar News