బెల్టు షాపులపై కొరడా ఝుళిపించాలి : ఏపీ సీఎం

Update: 2019-06-18 01:38 GMT

మద్యం బెల్టు షాపుల్ని నూటికి నూరు శాతం తొలగించాలని, అవసరమైతే కొరఢా ఝుళిపించాలని ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులకు ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశించారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న మద్యం షాపులను గుర్తించి లైసెన్సు రద్దు చేయాలని. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తమిళనాడులో ప్రభుత్వాలే మద్యంషాపుల్ని నియంత్రిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి త్వరితగతిన నివేదిక అందించాలని సూచించారు. అక్రమ మద్యం తయారుచేస్తున్న 190 గ్రామాలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టాలని సూచించారు. దశలవారీగా మద్య నిషేదం అమల్లోకి వచ్చేలా కార్యాచరణ ప్రణాళికను అధికారులకు జగన్‌ వివరించారు. ఆ గ్రామాల్లో తయారీదారులు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.   

Tags:    

Similar News