అవగాహన లోపంతోనే శ్వేతపత్రం విడుదల చేశారు

Update: 2019-07-10 16:09 GMT

ఏపీ ఆర్ధిక పరిస్థితిని వివరిస్తూ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు స్పందించారు. రెండకెల వృద్ధి రేటు సాధించే సామర్ధ్యం లేక పోవడం వల్లే ఇలాంటి పత్రాలు విడుదల చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యవసాయం రంగంపై తగిన అవగాహన లేకుండా బుగ్గన మాట్లాడారంటూ ఎద్దేవా చేశారు. ప్రపంచంలో అప్పులు తీసుకోని దేశాలు మూడే ఉన్నాయని తెలిసి తెలియకుండా మాట్లాడితే ఎలాగంటూ ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం హాయంలో తీసుకున్న నిర్ణయాలు, ఒప్పందాలను సమీక్షిస్తూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్ధికమంత్రి బుగ్గన బుధవారం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. 

Tags:    

Similar News