జగన్‌ ప్రభుత్వంపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు

Update: 2020-04-18 11:49 GMT

 ఏపీలో కరోనా వ్యాప్తి కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.' కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగంగా నిర్వహించేందుకు దక్షిణ కొరియా నుంచి లక్ష సత్వర పరీక్ష (రాపిడ్ టెస్ట్) కిట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగుమతి చేసుకోవడం ముదావహం. వీటి ద్వారా 10 నిమిషాల్లోనే ఫలితాలు రావడం.. రోజుకు 10వేల మందికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండటం మంచి పరిణామం' అని ఉప రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు.

ఈ పరికరాల ద్వారా కరోనా కేసుల్లో ప్రాథమిక పరీక్షలను వీలైనంత త్వరగా గుర్తించడం ద్వారా మరింత పకడ్బందీగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలను చేపట్టేందుకు వీలవుతుందని అన్నారు. కాగా కోవిడ్‌– 19 వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి లక్ష రాపిడ్‌ టెస్ట్‌ కిట్లను జగన్ సర్కార్ దిగుమతి చేసిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News