coronavirus : ఏపీలో మూడో కరోనా కేసు నమోదు!

Update: 2020-03-20 00:58 GMT
Representational Image

ఆంధ్ర ప్రదేశ్ లో మూడో కరోనా వైరస్ కేసు నమోదు అయింది. విశాఖపట్నంలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఇటీవల మక్కా వెళ్లి వచ్చిన ఒకరికి కరోన వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరులో ఒకరికి, ఒంగోలులో ఒకరికి కరోనా వైరస్ సోకినా విషయం విదితమే. ఇప్పుడు విశాఖలో నమోదు అయిన కేసుతో ఇది మూడో కరోనా బాధిత కేసు. ప్రస్తుతం విశాఖపట్నం చెస్ట్ ఆసుపత్రిలో కరోనా బాధితుడికి చికిత్స అందిస్తున్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో 14 కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. ఆంద్ర ప్రదేశ్ లో కూడా ఈ దిశలో నివారణ చర్యలు తీసుకుంటున్నారు. స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు. సినిమాహాళ్ళు, షాపింగ్ మాల్స్ మూసి వేశారు. ఇక నిన్న (మార్చి 19) న తిరుమల లో ఓ వ్యక్తికి కరోనా అనుమానంతో పరీక్షలు నిరహించారు. ఆయనకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది.నిన్నటి నుంచి వారం రోజుల పాటు తిరుమల లో దర్శనాలు నిలిపి వేస్తున్నట్టు ప్రకటించారు.

Tags:    

Similar News