కోడెల మెడపై గాట్లు : మాజీ మంత్రి సోమిరెడ్డి

కోడెల ఉరేసుకొని చనిపోయారనేది ఆవాస్తవం

Update: 2019-09-16 09:40 GMT

కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారం ఆవాస్తవమన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కోడెల మెడపై గాట్లు ఉన్నాయని చెప్పారు. పోస్టుమార్టం కోసం ఆయన భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ఫౌండర్ ,ఛైర్మన్ ఉన్న ఆస్పత్రిలోనే చనిపోవడం బాధాకరమన్నారు. కోడెల మృతి పార్టీకి ఆయన అభిమానులకు తీరని లోటని ఆయన తెలిపారు. కోడెల కుటుంబ సభ్యులకు మాజీమంత్రి సోమిరెడ్డి ప్రగాఢ సంతాపన్ని తెలిపారు. 

Tags:    

Similar News