ప్రకాష్ లో గణిత దినోత్సవ వేడుకలు
స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలో గణిత దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.
పాయకరావుపేట: స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలో గణిత దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. డిశంబర్ 22 న ప్రముఖ గణిత శాస్త్రవేత్త డా.శ్రీనివాస్ రామానుజన్ జయంతి సందర్భంగా విద్యార్థులకు వినూత్న రీతిలో వివిధ రకాల క్రీడా స్థలాల నమూనాలు తయారుచేయడంలో పోటీలు నిర్వహించారు. ఇందులో విద్యార్థులు ఆట స్థలాల కొలతలు నేర్చుకొని, వాటి నమూనాలను మైదానంలో ప్రదర్శించారు.
విద్యార్థులు తమ నమూనాలను ఫుట్ బాల్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ వంటి అనేక క్రీడా మైదానాలను వాటి అసలు కొలతల ఆధారంగా గణించి వాటి నమూనాలను అదే రీతిలో చిన్న పరిణామాల్లో తయారు చేశారు. ఈ సందర్భంగా వివిధ గణిత ఆధారిత పోటీలను మరియు క్విజ్ పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. కార్యక్రమం లో హెచ్ ఎం.సీతారాణి, శ్రీలక్ష్మి , శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల గణిత ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.