లాక్ డౌన్ 4.0 ఏపీలో ఇలా...

Update: 2020-05-18 12:06 GMT
YS Jagan (File Photo)

లాక్‌డౌన్‌ నాలుగో దశలో భాగంగా ఏపీ ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌-19పై సీఎం‌ జగన్‌  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించారు.

లాక్‌డౌన్‌ 4.0 నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆంక్షల సడలింపు.

ప్రజారవాణాకు అనుమతి, ఒకటి రెండురోజుల్లో తుది నిర్ణయం.

రేపటినుంచి వ్యక్తిగత కార్లలో ముగ్గురికి అనుమతి.

సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పై మరికొద్ది రోజులు ఆంక్షలు.

కంటైన్మెంట్ ప్రాంతాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో అన్ని రకాల దుకాణాలకు అనుమతి.

దుకాణాల వద్ద భౌతిక దూరం పాటిస్తూ ఐదుగురికి అనుమతివ్వాలని నిర్ణయం.

పెళ్లిళ్లు వంటి కార్యక్రమాలకు గరిష్ఠంగా 50 మందికి అనుమతివ్వాలి- అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం.

రెస్టారెంట్లు వద్ద భౌతిక దూరం పాటిస్తూ పార్శిళ్లకు అనుమతి.

ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచాలి.

రాత్రి 7 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం.

Tags:    

Similar News