సీఎం చంద్రబాబుకు ఆయన కూడా ఝలక్ ఇస్తారా?

Update: 2019-03-19 02:48 GMT

దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కర్నూల్ జిల్లా శ్రీశైలం నియోజకవర్గానికి అభ్యర్థిని ఎంపిక చెయ్యడంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఇక్కడనుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుడ్డా రాజశేఖరరెడ్డి పోటీ నుంచి

వైదొలగడమే కాకుండా.. శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో అభ్యర్థి వేటలో పడింది టీడీపీ. అయితే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సోదరుడు శేషారెడ్డి పోటీ చేస్తానని ముందుకు వస్తున్నా వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డికి ఆయన పోటీ ఇవ్వలేరని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిని బరిలోకి దింపడానికి ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ, అయితే శ్రీశైలంలో పోటీకి ఏరాసు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. పాణ్యం అయితేనే పోటీ చేస్తానని చెబుతున్నట్టు సమాచారం. ఎలాగోలా ఏరాసును ఒప్పించి శ్రీశైలం బరిలో దించుతారని కొందరు నేతలు అంటున్నారు. ఒకవేళ ఆయన పోటీ

చేయని పక్షంలో నంద్యాలకు చెందిన ఏవి సుబ్బారెడ్డిని పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోంది. మరి ఏరాసు పోటీకి సై అంటారో లేక అధినేతకు ఝలక్ ఇస్తారో తెలియాల్సి ఉంది. 

Similar News