జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. జగన్ సర్కార్ కు మద్దతు!

Update: 2020-03-27 01:54 GMT
Pawan Kalyan(file photo)

కష్టం వచ్చినపుడే మనిషి ఎలాంటివాడో తెలుస్తుందంటారు. రాజకీయాల్లో కూడా ఎవరేలాంటి వారో విపత్తుల వేళ అర్థం అవుతుంది. అవును .. రాజకీయాలు వేరు.. సమస్యలు వేరు అని చెప్పే పవన్ కళ్యాన్ కరోనా విపత్తుపై తనదైన పద్ధతిలో స్పందిస్తున్నారు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయలను విపత్తు నిధికి అందచేసిన పవన్ కళ్యాణ్ మరో ముందడుగు వేశారు. కరోనా తో ఇబ్బందులు పడుతుతున్న ప్రజలను ఆదుకోవాలని జనసైనికులకు పిలుపు ఇచ్చారు.

తాజాగా ఆయన తన ట్విట్టర్ ద్వారా కరోనా విపత్తు వేళ తన మానవతా దృక్ఫదాన్ని మరోసారి చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా విషయంలో తీసుకునే చర్యలకు జనసేన మద్దతు ఉంటుందని తెలిపారు. జగన్ సర్గార్కు ఇటువంటి విపత్కర పరిస్థితిలో జనసేన పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పారు. జనసైనికులను అలర్ట్ చేశారు. దీంతో పాటు ఏపీ ప్రభుత్వానికి కొన్ని సూచనలూ చేశారు. మార్కెట్లు మూసివేయడంతో మామిడి రైతులు భారీ నష్టాలు వస్తాయని భయపడుతున్నారని అందువల్ల దానికి సంబంధించిన చర్యలు ప్రభుత్వం చేపట్టాలనీ కోరారు. ఇక మహిళలపై నెలకొన్న ఒత్తిడిని దూరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పిన జనసేనాని స్వయం సహాయక బృందాలకు సంబంధించిన లోన్ తిరిగి కట్టేందుకు జూన్ వరకూ అవకాశం ఇవ్వాలనీ కోరారు.

దేశం విపత్తులో ఉన్న వేళలో జనసేనాని చేసిన ఈ ట్వీట్ అందరికీ స్ఫూర్తినిస్తుందని చెప్పవచ్చు. 



Tags:    

Similar News