Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త..మళ్లీ యథావిధిగా సర్వదర్శనం టోకెన్లు
Tirumala Tickets
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు గతంలో మాదిరే ఈనెల 23 నుంచి ఏ రోజుకారోజు సర్వదర్శనం టోకెన్లు అందిస్తామని తెలిపింది. టోకెన్లు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్ద ఉన్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్ద ఉన్న శ్రీనివాసం కౌంటర్లలో టికెక్లు తీసుకోవచ్చని తెలిపింది.
ఇదిలా ఉండగా..ఈనెల 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించిన సంగతి తెలిసిందే. టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలను కల్పించింది. వైకుంఠ ద్వారా దర్శనాలు ముగిసిన నేపథ్యంల తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. భక్తుల రద్దీ తగ్గే వరకు సర్వదర్శనం భక్తులను నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోకి అనుమతించి దర్శనాలు కల్పిస్తున్నది. ఈనెల 23 నుంచి ఏరోజుకారోజు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి ఐదుగంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 80, 581 మంది దర్శించుకున్నట్లు దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీవారికి 19, 228 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. వేంకటేశ్వరస్వామివారికి హుండీ ద్వారా రూ. 4.04కోట్ల వరకు ఆదాయం సమకూరిందని టీటీడీ తెలిపింది.