తిరుమలలో మరో సారి నకిలీ టిక్కెట్లు భాగోతం

Update: 2020-02-10 10:20 GMT
తిరుమలలో మరో సారి నకిలీ టిక్కెట్లు భాగోతం

తిరుమలలో మరోసారి నకిలీ టికెట్ల బాగోతం బయటపడింది. ఏకంగా నకిలీ అభిషేకం టికెట్లు విక్రయించి టీటీడీ అధికారులను మోసం చేశారు. గతంలో నకిలీ టికెట్ల విక్రయంపై విచారణ చేస్తున్నా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేకపోయారు. తాజాగా ఏకంగా నకిలీ అభిషేకం టిక్కెట్లు విక్రయం వెలుగుచూడటం అధికారుల వైపల్యానికి అద్దం పడుతోంది.

గత ఏడాది కేపి ఆదినారాయణ తన బంధువుల నుంచి తిరుపతికి చెందిన భరత్ అనే వ్యక్తి ద్వారా లద్దిక్ రాహుల్ అనే బ్రోకర్ ద్వారా 18 అభిషేకం టికెట్లు,13 సుప్రబాతం టికెట్లు తీసుకున్నారు. ఇందు కోసం 73 వేల రూపాయలు చెల్లించారు. 2019 డిసెంబర్ 13న దర్శనానికి వెళ్లిన వారిని విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా నకిలీ అభిషేకం టికెట్లు విక్రయం వెలుగుచూడటం కలకలం సృష్టిస్తోంది. నకిలీ టికెట్ల భాగోతం వెనుక చెన్నైకు చెందిన ముఠా ఉన్నట్లు భావిస్తున్నారు.


Full View

 

Tags:    

Similar News