బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి దుర్మరణం

Update: 2019-09-27 15:25 GMT

విశాఖలో మాజీమంత్రి బలిరెడ్డి సత్యారావు మృతి చెందారు. బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా వాహనం ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే బలిరెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించారని తెలుసుకున్న ఆప్తులు, అనుచరులు, అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా బలిరెడ్డి రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా కూడా పనిచేసిన సత్యారావు అప్పట్లో విశాఖ కీలకనేతగా ఉన్నారు.

Tags:    

Similar News