పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదు : దేవినేని ఉమా

Update: 2019-06-22 08:17 GMT

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ. ఇంజినీరింగ్‌ నిపుణుల కమిటీ సూచన మేరకే కాపర్‌ డ్యాం నిర్మాణం చేపట్టామన్నారు. పోలవరంపై సీఎం జగన్‌ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. నిబంధనల మేరకే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. 60 శాతం అప్పర్‌ కాపర్‌ డ్యాం పూర్తయిందని, పోలవరం నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమపై కోపంతో పనులను నిర్లక్ష్యం చేయొద్దని ఆయన సీఎంను కోరారు. ఇక పోలవరంలో కంటే కాళేశ్వరంలోనే ఆయన ఎక్కువ సమయం గడిపారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నిర్మిస్తే ఇరు తెలుగు రాష్ట్రాలు భారత్‌, పాకిస్తాన్‌లా మారతాయని జలదీక్షలో జగన్‌ చేసిన వ్యాఖ్యలను ఉమా గుర్తు చేశారు.

Tags:    

Similar News