కడప బయల్దేరిన సీఎం వైఎస్‌ జగన్‌

Update: 2019-07-08 04:28 GMT

సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ తొలిసారిగా సొంత జిల్లా కడప జిల్లాకు బయలుదేరారు. నేటి ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకుంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించి అనంతరం రోడ్డు మార్గాన గండి క్షేత్రానికి సీఎం జగన్ వెళ్లనున్నారు. గండి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం, పూజలు, అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఇడుపులపాయ సమీపంలోని గండి అంజనేయస్వామీ ఆలయాన్ని దర్శించనున్నారు. అనంతరం ఇక్కడే పలు పథకాలకు సంబంధించిన శిలఫలకాలను కూడా ఆయన ఆవిష్కరించి ప్రారంభించనున్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన పనులతో పాటు పులివెందులలో వైఎస్సార్ హార్టీ కల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా అరటి పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపనలు చేయనున్నారు.

10 గంటల 15 నిమిషాలకు ఇడుపులపాయ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టరులో జమ్మలమడుగు సమీపంలోని కన్నెలూరుకు వెళతారు. 10 గంటల 45 నిమిషాలకు కన్నెలూరు చేరుకుని జమ్మలమడుగు రైతు సదస్సుకు హాజరవుతారు. అక్కడ వ్యవసాయ శాఖ, ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ను జగన్ సందర్శిస్తారు. అనంతరం రైతు దినోత్సవం సభలో జగన్ ప్రసంగిస్తారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.

రైతు దినోత్సవ సందర్భంగా అన్ని జిల్లాల్లోను ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. నియోజకవర్గానికి లక్ష రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జగన్ పర్యాటన నేపథ్యంలో వీరన్నగట్టుపల్లె సర్కిల్‌ నుంచి ఇడుపులపాయ వరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. దీంతో ఇడుపులపాయ రహదారి కొత్త అందాలను సంతరించుకుంది.  

Tags:    

Similar News