ఎనిమిదో తరగతి విద్యార్థుల మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షకు దరఖాస్తులకు ఆహ్వానం

Update: 2019-08-02 05:13 GMT

ఎనిమిదో తరగతి విద్యార్థుల మెరిట్ స్కాలర్ షిప్ ల కోసం నిర్వహించే ఎన్ఎంఎంఎస్ఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ స్కీం ఎగ్జామినేషన్ ఫర్ క్లాస్ VIII) పరీక్ష నవంబర్ 3వ తేదీ ఆదివారం నిర్వహిస్తారని ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి ఆన్ లైన్ లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో తెలిపారు. ఎడో తరగతిలో ఓసీ,బీసీ విద్యార్థులకు కనీసం 55% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు కనీసం 50% మార్కులతోనూ లేదా బిప్లస్ కేటగిరీగానీ వచ్చిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పరీక్ష రాసేందుకు అర్హులు. ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూల్లో డే స్కాలర్స్ గా ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దీనికి దఖాస్తూ చేసుకోవచ్చు. అయితే, కుటుంబ ఆదాయం సంవత్సరానికి లక్షా ఎభైవేల రూపాయలు మించకుండా ఉండాలి.

దరఖాస్తులు ఈనెల 5 వతేదీ నుంచి ఆన్ లైన్ లో సబ్మిట్ చేయవచ్చు. విద్యార్థులు చదువుతున్న ఆయా స్కూల్స్ హెడ్మాస్టర్ ద్వారా దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది. దానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 5. పరీక్ష కోసం ఓసీ, బీసీ విద్యార్థులు 100 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ వ విద్యార్థులు 50 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 9. జిల్లా విద్యశాఖాదికారికి ప్రింటెడ్ నామినల్ రోల్స్ సెప్టెంబర్ 10 తేదీ కల్లా అందిచాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ అప్లికేషన్లు.. ఇతర పూర్తి సమాచారం కోసం www.bseap.org వెబ్సైట్ లో చూడొచ్చు.



Tags:    

Similar News