వరద ప్రాంతాల్లో మంత్రుల పర్యటన..ప్రమాదకరమైన రిటర్నింగ్ వాల్ ఎక్కిన మంత్రులు

Update: 2019-08-17 06:36 GMT

కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో కృష్ణా జిల్లాలోని లంక గ్రామాలు ముంపుకు గురయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ వల్ల ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటు విజయవాడలోని కృష్ణ లంక ప్రాంతాల్లో మంత్రులు అనిల్ కుమార్, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని పర్యటించారు. ప్రమాదకరమైన రిటర్నింగ్ వాల్ ఎక్కి మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ వరద స్థాయిని పరిశీలించారు. బాలాజీ నగర్, గీతా నగర్, తారకరామా నగర్ తదితర ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించారు. బాధితులను పునరావాస కేంద్రాలను తరలించేందుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. 

Tags:    

Similar News