అమ్మఒడి పథకంకి అర్హులు ఎవరంటే ...!

Update: 2019-06-20 01:17 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ అమ్మ పధకం ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే .. ఇదే విషయాన్నీ ఆయన ప్రమాణస్వీకారంలో కూడా చెప్పుకొచ్చారు .. అయితే ఈ పధకం ఎవరికి వర్తిస్తుంది అన్న దానిపై క్లారిటీ ఇచ్చేసింది ఏపీ ప్రభుత్వం .. కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, అందులో చదివే పిల్లల తల్లులు మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారని మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు పంపించే తల్లులకు 'అమ్మ ఒడి' కింద ఏడాదికి రూ.15 వేలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ పథకం ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందన్న ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. ఈ పధకాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్టు జగన్ ఇంతకు ముందే తెలిపారు .. 

Tags:    

Similar News