కరోనా సోకినవారిపై వివక్ష చూపొద్దు : సీఎం జగన్‌

Update: 2020-04-01 12:22 GMT
YS Jagan (File Photo)

ఏపీ సీఎం జగన్‌ బుధవారం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. వైరస్‌ వస్తే ఏదో జరిగిపోతుందని అనుకోవద్దన్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌ను అరికట్టవచ్చని చెప్పారు. వయసు మళ్లినవారిలో ఈ వైరస్‌ ప్రభావం కొంత తీవ్రంగా ఉందని తెలిపారు. 

సీఎం జగన్ పాయింట్స్....

రాష్ట్రంలో 87 పాజిటివ్ కేస్ లు వచ్చాయి

ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు,వారి సంబంధికులకే 70 పాజిటివ్ కేస్ లు వచ్చాయి

రాష్ట్రం నుంచి 1085 ఢిల్లీకి వెళ్లారు

ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో 585 మందికి టెస్ట్ లు చేసాం

రెండు రోజులుగా కేసులు పెరిగాయి

వాలంటీర్లు, ఎ ఎన్ ఎమ్,ఆశ వర్కర్స్ ఇప్పటికే ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య భద్రతపై సర్వే చేస్తున్నారు

ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలి

ఢిల్లీకి వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరినీ గుర్తించి వారికి వైద్య పరీక్షలు చేస్తున్నాం

కరోనా బాధితులకు వైద్య సేవలు అందించేందుకు ప్రయివేట్ డాక్టర్స్,నర్స్ లు ముందుకు రావాలి

కరోనా విపత్తు నేపద్యంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై భారం పడింది

ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ప్రశంసనీయం

రైతు కూలీలు,రైతన్నలు, ఆక్వ రంగంలో ఉన్న కూలీలు ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనులు చేసుకోవచ్చు

సామాజిక దూరం పాటిస్తూ రైతులు పనులు చేసుకోవచ్చు

కరోనా వచ్చిన వారిపై వివక్ష ప్రదర్శించరాదు

Tags:    

Similar News