నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Update: 2019-06-18 03:18 GMT

ఇవాళ అసెంబ్లీ సమావేశంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేయనునున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదాను ప్రస్తావించారు సీఎం జగన్. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు కోసం ఏవిధంగా ముందుకు వెళ్లాలనే దానిపై క్లారిటీ ఇవ్వనున్నారు. ప్రత్యేక హోదా సాధనపై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉంది.

శాసన సభ డిపూటీ స్పీకర్‌గా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఎన్నిక కాబోతున్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం సోమవారం స్పీకర్ తమ్మినేని సీతారాం నోటిఫికేషన్ విడుదల చేశారు. రఘుపతి నామినేషన్ బలపరుస్తూ 20మంది వైసీపీ ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఇవాళ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏపీ కేబినె‌ట్‌లో చోటు దక్కకపోవడంతో అదే వర్గానికి చెందిన కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. 

Tags:    

Similar News