Bigg boss Telugu Season 4 Teaser: బిగ్ బాస్ 4 పైన కీలక ప్రకటన చేసిన స్టార్ మా!

Bigg boss Telugu Season 4 Teaser: బిగ్ బాస్ 4 పైన కీలక ప్రకటన చేసిన స్టార్ మా!
x
bigg boss telugu season 4
Highlights

Bigg boss Telugu Season 4 Teaser: నార్త్ నుంచి సౌత్ కి పాకిన బిగ్ బాస్ షో తెలుగులో కూడా బాగానే క్లిక్ అయింది. ఇప్పటివరకు మూడు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది.

Bigg boss Telugu Season 4 Teaser: నార్త్ నుంచి సౌత్ కి పాకిన బిగ్ బాస్ షో తెలుగులో కూడా బాగానే క్లిక్ అయింది. ఇప్పటివరకు మూడు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా సమయంలో అసలు బిగ్ బాస్ సీజన్ 4 ఉంటుందా లేదా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే వాటన్నింటికీ తెరదించుతూ.. బిగ్‌బాస్‌ సీజన్‌ 4 పై స్టార్‌ మా అధికారిక ప్రకటన చేసింది.. త్వరలో బుల్లితెర ప్రేక్షకులను పలకరించడానికి ముందుకు వస్తున్నట్టుగా వెల్లడించింది. అంతేకాకుండా బిగ్ బాస్ 4కి సంబంధించిన ఆఫీషియల్ లోగోను రిలీజ్ చేసింది స్టార్ మా..

ఇక బిగ్ బాస్ 4 సీజన్ త్వరలో ఉంటుందని స్టార్ మా క్లారిటీ ఇవ్వడంతో ఇందులో ఉండే కంటెస్టెంట్ ల యొక్క లిస్ట్ పైన ఆసక్తి నెలకొంది.. అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో మాత్రం బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు వీళ్ళే అంటూ ఓ జాబితా అయితే చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న లిస్ట్ ప్రకారం చూస్తే.. ఇందులో హైపర్ ఆది, మంగ్లీ, తరుణ్, నందు, యాంకర్ ఝూన్సీ, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష, నటుడు తాగుబోతు రమేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడక తప్పదు.

హోస్ట్ గా అక్కినేని వారి కోడలు!

తెలుగులో ప్రసారం అయిన మూడు సీజన్స్ కి హోస్ట్ గా మేల్ ఆర్టిస్ట్ లు మాత్రమే వ్యవహరించారు.... మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండో సీజన్ కి నాని, మూడో సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు కొత్తగా షో నిర్వహకులు ఫిమేల్ సెలబ్రిటీతో ఈ ఏడాది సీజన్ ని నిర్వహించాలని అనుకుంటున్నారట.. అందులో భాగంగానే సమంత పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.. దీనికి సమంత ఒప్పుకుంటే మాత్రం ఇది గొప్ప విషయమే అని చెప్పవచ్చు.


Show Full Article
Print Article
Next Story
More Stories