Bandi Sanjay: మేడిగడ్డ కుంగుబాటుపై కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి

Bandi Sanjay: ఎన్నికల సమయంలో పొత్తు అంటూ బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారు

Shekhar G
Published on: 15 Feb 2024 4:51 PM IST
KCR Should Be Arrested For Medigadda Damage Says Bandi Sanjay
X

Bandi Sanjay: మేడిగడ్డ కుంగుబాటుపై కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి

Bandi Sanjay: మేడిగడ్డ ప్రాజెక్ట్‌ కుంగుబాటుపై మాజీ సీఎం కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలని ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జఫ్తు చేయాలన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో ఘనవిజయం సాధించే అవకాశాలు ఉన్నందునే కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని బండి సంజయ్‌ మండిపడ్డారు. నివేదికలు వచ్చాక కూడా చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు.

Shekhar G

Shekhar G

Next Story