విండీస్ విజయ లక్ష్యం 269

Update: 2019-06-27 13:35 GMT

వరల్డ్ కప్ టోర్నీలో వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఏమంత కలిసి రాలేదు. మొదటి నుంచీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న విండీస్ బౌలర్లను ఎదుర్కోవడానికి భారత్ బ్యాట్స్ మెన్ కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆరో ఓవర్లోనే ఓపెనర్ రోహిత్ శర్మ అవుట్ కావడంతో కెప్టెన్ కోహ్లీ పై పడ్డ భారమే పడింది. దానిని సమర్థవంతంగా నిర్వర్తించిన కోహ్లీకి రాహుల్ అండగా నిలబడ్డాడు. 21 వ ఓవర్ వరకూ వీరిద్దరూ విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. జట్టు స్కోరు 98 పరుగుల వద్ద ఉండగా రాహుల్ ను హోల్డర్ బౌల్డ్ చేయడంతో టీమిండియా ఇబ్బందుల్లో పడింది. తరువాత వచ్చిన శంకర్, జాదవ్ లు నిలదొక్కుకోలేక పోయారు. దీంతో పరుగులు చేయడానికి కూడా ఇబ్బంది కర పరిస్థితులు ఏర్పడ్డాయి. కోహ్లీకి ధోనీ జత కూడిన తరువాత కొంత వరకూ పరుగుల వేగం పెరిగింది. అయితే 39 వ ఓవర్లో ఆజట్టు స్కోరు 180 పరుగుల వద్ద కోహ్లీ (72) పరుగులకు అవుటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్ కుక్ వచ్చిన పాండ్య ధోనీ తో కలసి భారత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. సాధ్యమైనంత వరకూ పరుగులు రాబట్టారు వీరిద్దరూ. 38 బంతులాడిన పాండ్య 46 పరుగులు చేసి పరుగుల వేగం పెంచే క్రమంలో ఔటయ్యాడు. అప్పటికే ఇన్నింగ్స్ ఓవర్లు కూడా అయిపోవచ్చాయి. తర్వాత ధోనీ తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తమ్మీద టీమిండియా భారీ స్కోరు చేయడంలో విఫలం అయింది. 50వ ఓవర్లో ధోనీ 16 పరుగులు(రెండు భారీ సిక్సర్లు, ఒక ఫోర్) బాడంతో జట్టు స్కోరు 250 దాటింది. విండీస్ కు 269 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది.  

Tags:    

Similar News