కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్‌కోచ్‌గా మెక్‌కలమ్

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్‌కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ని నియమించారు. 2016‌లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ మాజీ ఓపెనర్ ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో కొనసాగాడు. అయితే, 2019 ఐపీఎల్ సీజన్‌‌లో ఇతనిని ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.

Update: 2019-08-16 06:10 GMT

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్‌కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ని నియమించారు. 2016‌లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ మాజీ ఓపెనర్ ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో కొనసాగాడు. అయితే, 2019 ఐపీఎల్ సీజన్‌‌లో ఇతనిని ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఈ నేపధ్యంలో 2020 ఐపీఎల్‌‌ని మెక్‌కలమ్ పర్యవేక్షణలోనే కోల్‌‌కతా నైట్‌రైడర్స్ ఆడనుందని ఆ జట్టు ఫ్రాంఛైజీ తాజాగా ప్రకటించింది.

ఐపీఎల్ తొలి సీజన్ లో సంచలనం..

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా 2008, ఏప్రిల్ 18న కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ తొలి సీజన్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున బరిలోకి దిగిన మెక్‌కలమ్ (158 నాటౌట్: 73 బంతుల్లో 10x4, 13x6) విధ్వంసక శతకంతో చెలరేగాడు. దీంతో.. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగా.. ఛేదనలో బెంగళూరు 15.1 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. అభిమానులకి ఐపీఎల్ మజాని పరిచయం చేసిన మ్యాచ్‌గా ఇది చరిత్రలో నిలిచిపోయింది.

ఇప్పుడు మెక్‌కలమ్ ఆ జట్టుకే హెడ్ కోచ్ గా వస్తుండడం జట్టుకి బలం ఇస్తుందనడంలో సందేహం లేదు. వచ్చే సీజన్ లో కోల్ కత నైట్ రైడర్స్ సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.


Tags:    

Similar News