రోహిత్.. సచిన్ రికార్డులు బ్రేక్ చేస్తాడా?

Update: 2019-07-05 07:30 GMT

వరల్డ్ కప్ టోర్నీలో రోహిత్ శర్మ దూసుకుపోతున్నాడు. బౌలర్లని ముప్పుతిప్పలు పెడుతూ ఇప్పటికే నాలుగు సెంచరీలు బాదేశాడు. ఒకే ప్రపంచ కప్ లో నాలుగు సెంచరీలు బాదిన శ్రీలంక క్రికెటర్ కుమారా సంగక్కర రికార్డును ఇప్పటికే సమానం చేశాడు. ఇంకో సెంచరీ చేస్తే ఆ రికార్డు బద్దలవుతుంది. ఇదిలా ఉంటె ఇంకో రెండు ఆసక్తికర రికార్డులకు చేరువలో రోహిత్ ఉన్నాడు. అవి రెండూ లిటిల్ మాస్టర్ సచిన్ వి కావడం విశేషం. 2003 వరల్డ్ కప్ లో సచిన్ మొత్తం 11 మ్యాచ్‌ల్లో 673 పరుగులు సాధించగా లీగ్‌ దశలో 586 పరుగులు చేశాడు. ఇప్పుడు రోహిత్ ఇప్పటికే 544 పరుగులు సాధించాడు. ఇంకా 42 పరుగులు చేస్తే లీగ్ దశలో అత్యధిక పరుగుల రికార్డు అందుకుంటాడు. ఇక ఇంకో 129 పరుగులు చేస్తే టోర్నీ అత్యధిక పరుగులు రికార్డు సొంతం అవుతుంది. భారత్ ఇంకా ఓకే లీగ్ మ్యాచ్ ఆడాలి. కచ్చితంగా ఓ నాకౌట్ మ్యాచ్ ఆడుతుంది. ఫైనల్ కు వస్తే రెండు మ్యాచ్ లు ఆడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రికార్డులు సాధించడం పేద కష్టమైన పని కాదు. 

Tags:    

Similar News