ఇండియన్ సూపర్‌లీగ్‌..దిశా-టైగర్‌ డ్యాన్స్‌ వీడియో వైరల్‌

ఇండియన్ సూపర్‌లీగ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాఘీ 2 ఫేం జంట తమ డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరించారు.

Update: 2019-10-21 12:23 GMT

ఇండియన్ సూపర్‌లీగ్‌ (ఫుట్‌ బాల్‌) ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాఘీ 2 ఫేం జంట తమ డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన దిశాపటానీ, టైగర్‌ష్రాప్‌ జంట బంగారు రంగు కాస్ట్యూమ్స్‌లో బాఘీ-2 సినిమాలోని పాటకు అదరగోట్టే స్టెప్పులేసారు.

వీరు వేసే స్టెప్పులకు అక్కడకు వచ్చిన ప్రేక్షకులు కొట్టే చప్పట్లు తోడయ్యాయి. వీరి డాన్స్ తో స్టేడియం అంతా ప్రేక్షకుల చప్పట్లు, ఈలలతో స్టేడియం మార్మోగిపోయింది. ఎమైతేనే బాలీవుడ్‌ యువ సెలబ్రిటీలు ఇండియన్‌ సూపర్‌లీగ్‌ (ఫుట్‌ బాల్‌) ఓపెనింగ్‌ సెర్మనీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ క్రేజీ కపుల్ చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




Tags:    

Similar News