Indian Railways: మెయిల్ రైళ్లకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్ల మధ్య తేడాలు ఇవే?

Indian Trains: రైళ్లలో చాలాసార్లు ప్రయాణించే ఉన్నాం. అయితే, వీటిలో ప్యాసింజర్, మెయిల్, సూపర్ ఫాస్ట్ లేదా ఎక్స్‌ప్రెస్ అంటూ చాలా రైళ్లు ఉన్నాయి.

Update: 2023-05-02 15:30 GMT

Indian Railways: మెయిల్ రైళ్లకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్ల మధ్య తేడాలు ఇవే?

Indian Trains: రైళ్లలో చాలాసార్లు ప్రయాణించే ఉన్నాం. అయితే, వీటిలో ప్యాసింజర్, మెయిల్, సూపర్ ఫాస్ట్ లేదా ఎక్స్‌ప్రెస్ అంటూ చాలా రైళ్లు ఉన్నాయి. రైళ్లలో ఇలా రకరకాల పేర్లు ఎందుకు రాస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పదాల అర్థం మీకు తెలియకపోతే, ఈ రోజు తెలుసుకుందాం. దీనితో పాటు, ఈ రైళ్ల మధ్య వ్యత్యాసాన్ని కూడా ఇప్పుడు తెలుసుందాం..

సూపర్ ఫాస్ట్ రైళ్లు..

భారతీయ రైల్వే అధికారుల ప్రకారం, సూపర్ ఫాస్ట్ రైలు (superfast) సూపర్ ఫాస్ట్ రైళ్లు సాధారణంగా గంటకు 100 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో నడుస్తాయి. మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే దీని స్టాపేజ్‌లు తక్కువ. ఈ రైళ్ల ఛార్జీలు మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ రైళ్లు ఎక్కువగా దూర మార్గాల్లో నడుస్తంటాయి.

ఎక్స్‌ప్రెస్ రైళ్లు..

సూపర్‌ఫాస్ట్ రైళ్లతో పోలిస్తే ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం కొంచెం తక్కువగా ఉంటుంది. అవి మెయిల్ రైళ్ల కంటే వేగంగా నడుస్తున్నా.. ఈ రైళ్ల సగటు వేగం సాధారణంగా గంటకు 55 కి.మీ.గా ఉంటుంది. ఈ రైళ్ల స్టేషన్లు సూపర్ ఫాస్ట్ రైళ్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ, అవి అన్ని చోట్ల ఆగవు. దీంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకుంటాయి.

మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..

పూర్వకాలంలో రైళ్లలో పోస్ట్ బాక్స్‌లు ఉండేవి. దాని ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉత్తరాలు, పార్శిళ్లను పంపేవారు. అందుకే ఆ రైళ్లకు మెయిల్ ఎక్స్‌ప్రెస్ అని పేరు వచ్చింది. ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లలో పోస్ట్ బాక్స్‌లను తొలగించారు. అయినప్పటికీ, ఈ రైళ్లను ఇప్పటికీ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలు అని పిలుస్తున్నారు. ఈ రైళ్ల సగటు వేగం గంటకు 50 కి.మీ.గా ఉంటుంది. ఇలాంటి రైళ్లు చాలా స్టేషన్లలో ఆగి తమ గమ్యస్థానానికి చేరుకుంటాయి.

ప్యాసింజర్ రైళ్లు..

భారతీయ రైల్వేలు తక్కువ దూర మార్గాల కోసం నడిపే రైళ్లను ప్యాసింజర్ రైళ్లు అంటారు. ఈ రైళ్లలో ఉపయోగించే చాలా కోచ్‌లు జనరల్ కేటగిరీకి చెందినవి. ఈ రకమైన ప్యాసింజర్ రైలు మార్గంలో పడే చిన్న, పెద్ద స్టేషన్‌లన్నింటిలో ఆగడం ద్వారా దాని గమ్యాన్ని చేరుకుంటుంది. దీని కారణంగా దాని సగటు వేగం గణనీయంగా తక్కువగా ఉంటుంది. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది.

Tags:    

Similar News