లక్ష్మీపార్వతి పాత్ర రిలీజ్ చేసిన వర్మ

Update: 2019-01-11 14:46 GMT

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎన్టీఆర్‌ జీవితలోని ముఖ్య ఘట్టాన్ని లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసిన వర్మ.. తాజాగా లక్ష్మీపార్వతి పాత్ర ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞ శెట్టి నటిస్తుందని చెప్పిన వర్మ.. ఆ పాత్రకు సంబంధించి పలు ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

 యజ్ఞ శెట్టి గతంలో వర్మ దర్శకత్వం వహించిన 'కిల్లింగ్ వీరప్పన్' చిత్రంలో వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి పాత్రలో నటించారు. ఆ చిత్రంలో ఆమె నటన సహజత్వానికి దగ్గరగా ఉండటంతోనే లక్ష్మి పార్వతి పాత్రకు ఆమెను తీసుకున్నట్టు తెలుస్తోంది. జీవీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్‌ సంగీతమందిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానున్నట్టు సమాచారం. కాగా  ఇదివరకే విడుదల చేసిన వెన్నుపోటు పాట టీడీపీ శ్రేణులను ఆగ్రహానికి గురిచేశాయి.  

Similar News