Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో చైతూ మూవీ.. లేనట్టేనా..?

Naga Chaitanya: పరశురామ్ తో నాగచైతన్య సినిమా లేనట్టేనా?

Update: 2023-01-25 12:00 GMT

ఆ డైరెక్టర్ తో నాగచైతన్య సినిమా ఉండదా?

Naga Chaitanya: "లవ్ స్టోరీ", "బంగార్రాజు" వంటి సినిమాలతో వరుస సూపర్ హిట్ లు అందుకున్న యువ హీరో అక్కినేని నాగ చైతన్య ఆ తర్వాత "థాంక్యూ" సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయారు. మరోవైపు అమీర్ ఖాన్ హీరోగా నటించిన "లాల్ సింగ్ చద్దా" సినిమాతో హిందీలో కూడా అడుగుపెట్టిన నాగ చైతన్య ఆ సినిమా తో కూడా మంచి హిట్ అందుకోలేకపోయారు. తాజాగా ఇప్పుడు నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో "కస్టడీ" అనే సినిమాతో బిజీగా ఉన్నారు.

అంతేకాకుండా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో కూడా నాగ చైతన్య "దూత" అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. అయితే నాగ చైతన్య మరియు పరుశురామ్ కాంబినేషన్లో ఎప్పటినుంచో ఒక సినిమా రావాల్సి ఉంది. కానీ అప్పుడే మహేష్ బాబు తో "సర్కారు వారి పాట" సినిమా అవకాశం రావడంతో పరుశురామ్ నాగచైతన్య సినిమాని పక్కన పెట్టారు. తాజాగా ఇప్పుడు మళ్లీ పరశురాం దర్శకత్వంలో నాగచైతన్య నటించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పట్లో పట్టాలక్కే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ వారు ఈ సినిమాని నిర్మించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా ఇప్పట్లో అయితే లేనట్లే అని తెలుస్తోంది. మరి భవిష్యత్తులో అయినా నాగ చైతన్య మళ్లీ పరశురామ్ సినిమాని చేయడానికి ఒప్పుకుంటారో లేదో వేచి చూడాలి.



 

Tags:    

Similar News