రౌడీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

గత ఏడాది డియర్‌ కామ్రెడ్‌ సినిమాతో ఫ్యాన్స్ ని నిరాశపరిచిన హీరో విజయ్ దేవరకొండ ఈ సారి పక్కా ప్లాన్ తో బరిలోకి

Update: 2020-01-02 13:56 GMT
vijay devarakonda

గత ఏడాది డియర్‌ కామ్రెడ్‌ సినిమాతో ఫ్యాన్స్ ని నిరాశపరిచిన హీరో విజయ్ దేవరకొండ ఈ సారి పక్కా ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ వచ్చే నెల పిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ నలుగురు హీరోయిన్స్ (రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్‌ థెరీసా, ఇజబెల్లా) తో కలిసి సందడి చేయనున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, హీరోయిన్స్ తో విజయ్ లూక్స్ సినిమాపైన అంచనాలను అమాంతం పెంచేసాయి.

ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ప్రమోషన్ లతో హోరేత్తిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని న్యూ ఇయర్ సందర్భంగా రేపు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని విజయ్ తన అధికార ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. కేయస్‌ రామారావు సమర్పణలో కేఎ వల్లభ నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌ సంగీతమందిస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ పూరి డైరెక్షన్ లో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని చార్మీ, పూరి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారానే విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని సమాచారం.   

Tags:    

Similar News