అల్లు అరవింద్ రామాయణంలో సీత ఎవరు?

Update: 2019-07-13 04:10 GMT

అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్ తో రామాయణాన్ని తెరకెక్కించడానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింది ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ ప్రకటన వెలువడిన దగ్గరనుంచీ, సినిమాలో ఎవరు నటిస్తారనే దానిపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది. ముఖ్యంగా సీత పాత్ర ఎవరు చేస్తారనే దానిపై ఊహాగానాలు ఎక్కువైపోయాయి. రామాయణం కథలో సీత పాత్రకు ఉండే ప్రాముఖ్యత అందరికీ తెలుసు. దీనికి సంబంధించి ఓ వార్త బాగా చక్కర్లు కొడుతోంది. నాయనతార సీతగా నటించ వచ్చని చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ నటించిన 'శ్రీరామ రాజ్యం' చిత్రంలో నయన్‌ సీత పాత్రలో నటించి అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే సమయంలో అనుష్క పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు సీత అనేది వేచి చూడాల్సిందే.

త్రీడీ రూపంలో మూడు భాగాలుగా రాబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ కోసం మధు మంతెన, నమిత్‌ మల్హోత్రా, అల్లు అరవింద్‌ చేతులు కలిపారు. 'దంగల్' ఫేం నితీశ్ తివారీ, 'మామ్' ఫేం రవి ఉద్యవార్ దర్శకత్వం వహించనున్నారు. తొలిభాగం 2021లో విడుదల కానుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు, సినిమా చిత్రీకరణ ప్రారంభోత్సవ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Tags:    

Similar News