తాప్సి కి ఏమైంది?

Update: 2019-06-09 16:28 GMT

చేతికి తీవ్రంగా గాయాలున్న ఫోటో ఒకటి ప్రముఖ నటి తాప్సి ట్విట్టర్ లో ఉంచింది. ఆమె ప్రస్తుతం గేమ్ ఓవర్ సినిమా ప్రచారం లో నిమగ్నమైవుంది.అయితే, తాప్సి షేర్ చేసిన ఫోటో చూసిన వారంతా తాప్సి కి ఏమైందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఆ ఫోటో కి 'మంచు కొండల్లో షిఫాన్‌ చీరలు కట్టుకుని ఇరవై ఐదు రోజుల పాటు చిత్రీకరణ చేయడం చాలా కష్టం. అందుకే నేను వీటిని ఎంచుకున్నాను' అని తాప్సి కాప్షన్ పెట్టింది. దీంతో ఇది ఏదన్న సినిమా షూటింగ్ లో భాగంగా పెట్టిందా లేక తాప్సి కి నిజంగానే ఎమన్నా అయ్యిందా అని అభిమానులు కంగారు పడుతున్నారు. అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న 'గేమ్‌ ఓవర్‌' సినిమా 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదీ కాకుండా బాలీవుడ్‌లో 'దిల్‌ జంగ్లీ' అనే సినిమాలోనూ ప్రస్తుతం తాప్సి నటిస్తోంది. 



Tags:    

Similar News