యాక్షన్ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో విశాల్ కి మంచి క్రేజ్ ఉండడంతో సినిమా ఇక్కడ 6.7 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు టాక్

Update: 2019-11-16 14:46 GMT
action movie 1st day collections

ఈ వారం విడుదలైన సినిమాల్లో విశాల్ యాక్షన్ సినిమా ఒకటి.. తమన్నా హీరోయిన్ గా నటించింది. సుందర్.సి దర్శకత్వం వహించారు. విశాల్ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ నిన్న రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా మంచి టాకే వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం సినిమాకి ఆశించిన స్థాయిలో రాలేకపోయాయి. ఈ సినిమాకి మొదటిరోజు 0.67 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది... దీనికి తోడు సందీప్ కిషన్ సినిమా 'తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్' విడుదల అవ్వడం, సినిమాకి మంచి టాక్ రావడంతో ఈ సినిమాపై ఎఫెక్ట్ పడింది.

తెలుగు రాష్ట్రాల్లో విశాల్ కి మంచి క్రేజ్ ఉండడంతో సినిమా ఇక్కడ 6.7 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు టాక్. బ్రేక్ ఈవెన్ కావాలంటే యాక్షన్ సినిమా మరో 6.04 కోట్ల షేర్ వరకూ రాబట్టాల్సి ఉంది. సో సో గా మొదలైన కలెక్షన్లు ఎంత వరకు వెళ్తాయో చూడాలి ఇక.. విశాల్ ఈ సినిమా తర్వాత చక్ర అనే సినిమాని చేయనున్నాడు. దీనికి ఆనంద్ ఎం ఎస్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో విశాల్ కి జోడిగా శ్రద్దా శ్రీనాథ్, రెజినా నటించనున్నారు. 

Tags:    

Similar News