తీవ్రమైన అస్వస్థతకి గురైన దర్శకుడు కోడి రామకృష్ణ

Update: 2019-02-21 09:43 GMT

టాలీవుడ్ లో పేరు మోసిన దర్శకులలో సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ కూడా ఒకరు. తాజా సమాచారం ప్రకారం గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏ ఐ జి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. గతంలో పక్షవాతం బారిన పడ్డ ఆయన త్వరగానే కోలుకున్నారు ఈసారి కూడా త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

కోడిరామకృష్ణ తీవ్రమైన అస్వస్థతకి లోను కావడంతో, కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్ - గచ్చీబౌలీలోని ఏఐజీ హాస్పిటల్లో చేర్పించినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆయన ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. 1982లో 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమా తో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం అయిన కోడి రామకృష్ణ చాలా పెద్ద హిట్ సినిమాలను అందుకున్నారు. 'అమ్మోరు', 'అరుంధతి' లాంటి బ్లాక్బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన ఆఖరిసారిగా కన్నడ భాషలో 2016లో 'నాగ రాహువు' అనే సినిమాను తెరకెక్కించారు. ఇక తెలుగులో ఆయన ఆఖరి సారిగా దర్శకత్వం వహించిన సినిమా 'అవతారం'. 

Similar News