దివ్యాంగుల కోసం వెంకీమామ స్పెషల్ షో.. ఎమోషనల్ అయిన వెంకీ
2019 సంవత్సరంలో విక్టరీ వెంకటేష్ కి కచ్చితంగా గుర్తుండిపోతుంది. చేసిన రెండు మల్టీస్టారర్ సినిమాలు f2, వెంకీమామ
2019 సంవత్సరంలో విక్టరీ వెంకటేష్ కి కచ్చితంగా గుర్తుండిపోతుంది. చేసిన రెండు మల్టీస్టారర్ సినిమాలు f2, వెంకీమామ మంచి హిట్టు అయ్యాయి. ఇందులో తాజాగా విడుదలైన వెంకీమామ సినిమా దియేటర్లో సందడి చేస్తుంది. ఇందులో వెంకీ అయన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి నటించాడు. రియల్ మామ అల్లుళ్ళు అయిన వెంకీ, చైతూ కలిసి తొలిసారి రీల్ లైఫ్లో కూడా మామ, అల్లుళ్ళుగా నటించడంతో సినిమాపైన మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా ఉండడంతో సినిమాకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి.
ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించగా, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సినిమాని నిర్మించాయి. అయితే తాజాగా హీరో వెంకటేష్ దివ్యాంగుల కోసం ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. వెంకీని కలిసిన పిల్లలు చాలా ఎమోషనల్ గా వెంకీని హాగ్ చేసుకున్నారు. వెంకీ కూడా అంతే ప్రేమతో వారిని దగ్గరకి తీసుకొని ఆప్యాయంగా పలకరించారు. క్రిస్మస్ పండగ సందర్భంగా వారికీ కొన్ని గిఫ్ట్స్ కూడా అందించారు. వెంకటేష్. హీరో వెంకీ చూపించిన ఈ ప్రేమని చూసి తెగ మురిసిపోయారు ఆ చిన్నారులు.
ప్రస్తుతం వెంకటేష్ తమిళ్ లో మంచి హిట్టైనా అసురన్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రానా కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తుంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.
Special screening of #VenkyMama for orphanage kids
— BARaju (@baraju_SuperHit) December 24, 2019
The kids got emotional and hugged #VictoryVenkatesh. The hero also presented gifts to the kids as Christmas special@chay_akkineni @SureshProdns @peoplemediafcy @RaashiKhanna @starlingpayal @MusicThaman#BlockbusterVenkyMama pic.twitter.com/R21nHh7uUM