ఉప్పెనలా దూసుకొస్తున్న మెగా మేనల్లుడు!
ఇప్పటికే మెగా మేనల్లుడుగా సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు వైష్టవ్ తేజ్.
ఇప్పటికే మెగా మేనల్లుడుగా సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు వైష్టవ్ తేజ్.. వైష్టవ్ తేజ్ మొదటి సినిమాగా 'ఉప్పెన' తెరకెక్కుతుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా సుకుమార్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సాన ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఇప్పటికే సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చేపలు పట్టే యువకుడిగా ఓ లుక్ ని బయటపెట్టిన చిత్ర బృందం ఈ రోజు సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్ లో వైష్ణవ్ తేజ్ సముద్రం వైపు చేతులు చాపి బిగ్గరగా కేక వేస్తూ కనిపించాడు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు.సాయి చంద్, బ్రహ్మాజీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.
Presenting the First Look of #Uppena 🌊
— Mythri Movie Makers (@MythriOfficial) January 23, 2020
Experience the Ocean of Love in Theatres from April 2nd, 2020 ❤️#UppenaOnApril2nd#UppenaFirstLook 🌊
Introducing actors #PanjaVaisshnavTej, #KrithiShetty and Director #BuchiBabuSana 😊
A Rockstar @ThisIsDSP Musical 🎶 pic.twitter.com/8zDGKQZ4aM