రణు మోండల్ పై వీపరితమైన ట్రోలింగ్

అయితే ఈ ఫోటోపై సోషల్ మీడియాలో వీపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. ఆమెకు మేకప్‌ వేసిన వ్యక్తి 2020 ఆస్కార్‌ అవార్డ్ ఇవ్వాలని

Update: 2019-11-17 09:29 GMT
రణు మోండల్

రణు మోండల్ అంటే ఒకప్పుడు ఎవరికీ తెలియకపోవచ్చు.. కానీ ఇప్పుడు ఆమె ఓ సెలబ్రిటీ... ఎవరో ఒకరు ఆమె రైల్వే ప్లాట్ ఫాంపై  పాడిన పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె పేరు మారు మ్రోగింది. ఆమె పాటలకి వీపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆమెకు దేవుడు చాలా అందమైన గొంతుని ఇచ్చాడని చాలా మంది ప్రశంసలు గుప్పించారు. దీనితో ఆమెకి బాలీవుడ్ లో చాలా సినిమాలకి పాటలు పాడే అవకాశం వచ్చాయి.

హిమేష్ రేష్మియా తన సినిమాలో పాడే అవకాశాన్ని ఇచ్చి ఆమెకి మరిన్ని సినిమా ఆఫర్స్ వచ్చేలా చేసాడు. అయితే ఒకప్పుడు నెటిజన్లతో శభాష్ అనిపించుకున్న రణు మోండల్ ఇప్పుడు అదే నెటిజన్లతో విమర్శల పాలు అవుతుంది. తాజాగా ఆమె హెవీ మేకప్‌తో ఉన్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనితో నెటిజన్లు ఆమె పై ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఆమె దేనికి ఇలా రెడీ అయ్యిందో తెలియదు కానీ ఫోటో మాత్రం వైరల్ అవుతుంది.

ఈ ఫోటోపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ ...  ఆమెకు మేకప్‌ వేసిన వ్యక్తి 2020 ఆస్కార్‌ అవార్డ్ ఇవ్వాలనీ ,మరొకరు ఎక్స్‌పెక్టేషన్స్‌, రియాలిటీకి తేడా ఇవే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తనకి వచ్చిన క్రేజ్ ని వాడుకోకుండా రణు మోండల్ అనవసరమైన ఆర్బాటాలకు పోయి నిత్యం వార్తల్లో నిలుస్తూ విమర్శల పాలు అవుతుంది.



Tags:    

Similar News