కరోనా క్రైసిస్ ఛారిటీకి అల్లు అర్జున్ 20 లక్షల విరాళం

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2020-03-30 14:43 GMT
Allu Arjun (File Photo)

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. ఇక చిత్ర పరిశ్రమలో థియేటర్ల మూసివేయడంతో పాటు షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి. దీనితో సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది..

ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సినీ పరిశ్రమలోని నటులు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) 'మనకోసం'ను ప్రారంభించారు. కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి, నాగార్జున కోటి రూపాయలను ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌ చెరో 25 లక్షలు, లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు, రవితేజ 25 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ప్రకటించి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు.

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ. 20 లక్షలు ప్రకటించాడు. ఇంతకుముందే అల్లు అర్జున్ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షలు చొప్పున రూ. కోటి రూపాయలు, తనను ఎంతో ఆదరించిన కేరళ రాష్ట్రానికి రూ. 25 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తంగా రూ. 1 కోటి 45 లక్షలు విరాళంగా అల్లు అర్జున్ ఇచ్చారు.


Tags:    

Similar News