నా పేరు సీత.. అలా చేస్తే బావుండదు!

Update: 2019-05-10 06:10 GMT

సంచలన దర్శకుడు తేజ చాలాకాలం తరువాత మళ్లీ తనదైన శైలిలో రంగంలోకి రాబోతున్నారు. చందమామ కాజల్ ను సీతగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాను తేజ ప్రకటించినపుడే ఆసక్తి రేకెత్తింది. ఇపుడు సినిమా ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.

నా పేరు సీత అంటూ కాజల్ ని ముద్దుగా చూపిస్తూనే.. సీతను రావణాసురుడు ఎత్తుకెళ్ళడం తప్పు కాదు.. రాముడి భార్యను ఎత్తుకెళ్ళడం తప్పు అని హీరో బెల్లంకొండ శ్రీను తో చెప్పించి ఒక్కసారిగా సినిమా పై అంచనాలు పెంచేశారు. సీత సినిమా ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సోనూసూద్ ప్రతినాయకుడిగా కనిపించనున్న సీత సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ నెల 24వ తేదీన విడుదలకానున్న సినిమా థిరియాట్రికల్ ఇపుడు సందడి చేస్తోంది. 

Similar News