తమన్ 'సామజవరగమన' విన్నారుగా,,! ఇప్పుడు ఈ ఉపాధ్యాయుడి 'సామజవరగమన' వినండి!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ నుంచి వచ్చిన తాజా చిత్రం “ఆల. .నైకుంఠపురములో'..

Update: 2020-01-12 07:21 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ నుంచి వచ్చిన తాజా చిత్రం "ఆల. .నైకుంఠపురములో'..పూజా హేగ్దే కథానాయకగా నటించింది. ఈ రోజు భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాలోని సామజవరగమన' పాట ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సాంగ్ బయటకి వచ్చినప్పటి నుంచి శ్రోతలను వీపరితంగా ఆకట్టుకుంటుంది ఈ సాంగ్..యూ ట్యూబ్ లో అత్యధిక మంది లైక్ చేసిన పాటగా రికార్డు సృష్టించింది కూడా. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు. తమన్ సంగీతం అందించాడు. అయితే ఈ పాటని పేరడీ చేశాడు ఓ ఉపాధ్యాయుడు .. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"నీ కళ్లకు కావాలి కాస్త నీ భవిష్యత్తుపై కలలు.. సమయమంతా నీ వృథా చేస్తే ఉండదురా ప్యూచరూ..

నీ మనసు గాలి ఊయ్యాలలూగుతూ ఉంటే చెడిపోతావ్‌.. నీ ధ్యాసను కొంత చదువులో పెడితే మంచోడివి అవుతావ్‌..

సామజవరగమన నేను చూసి అగగలనా ! చదవకుండా అల్లరి చేస్తే చూస్తూ ఉండగలనా !

పోజులు మనుమా ! స్టైల్ లను వీడుమా ! ఎన్నెన్ని సోకులు ఉన్నాకానీ తెలివిని పెంచునా

మంచిగా చదువుమా ! బుద్దిగా ఉండుమా ! పదిమందిలోనూ నీకు మంచి పేరునూ పొందుమా

నీ ధ్యాసే నాన్నకు .. నీ ఉసే అమ్మకు ఉలకవు .. పలకవు చిన్నా

నువ్వు పుస్తకం పట్టక చదవకపోతే ఫెయిల్ అవుతావ్ కన్నా ! ఆ చూపులన్నల్ల పక్కకు పెట్టకు టైం వెస్ట్ రా నాన్న

నీ కళ్లకు కావాలి కాస్త నీ భవిష్యత్తుపై కలలు.. సమయమంతా వృథా చేస్తే ఉండదురా ప్యూచరూ.. "

విద్యార్ధులు తమకున్న సమయాన్ని వృధా చేయకుండా మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని ఓ పాట రూపకంగా చెప్పారు ఈ ఉపాధ్యాయుడు. అయితే ఇది ఎక్కడ, ఎవరు ఆ ఉపాధ్యాయుడు అన్నది తెలియదు కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక ఆ ఉపాధ్యాయుడి పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 


 

Tags:    

Similar News