Superstar Rajinikanth:సూపర్ స్టార్ రజనీకాంత్‌ రూ.50 లక్షల విరాళం

కరోనా వైరస్ ప్రభావం దేశవ్యాప్తంగా అన్ని రంగాలపైనా పడింది. ఇక చిత్ర పరిశ్రమలో సినిమా థియేటర్లు మూసివేశారు.

Update: 2020-03-24 08:09 GMT
Superstar Rajinikanth

కరోనా వైరస్ ప్రభావం దేశవ్యాప్తంగా అన్ని రంగాలపైనా పడింది. ఇక చిత్ర పరిశ్రమలో సినిమా థియేటర్లు మూసివేశారు.షూటింగ్ లను కూడా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. షూటింగ్ లను రద్దు చేయడం వలన సినీ పరిశ్రమలోని కార్మికులు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. వీరిని ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమలోని పలువురు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే హీరో రాజశేఖర్ నిత్యవసర వస్తువులను అందించేందుకు ముందుకు వచ్చారు.

ఇక తమిళ హీరో సూర్య, కార్తీ కలిసి పది లక్షల రూపాయలను ఫెప్సీకి విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా రజనీకాంత్, విజయ్ సేతుపతి ముందుకు వచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా కార్మికుల కి 50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక విజయ్ సేతుపతి 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.

ఇదిలా ఉండగా హీరో శివకార్తికేయన్‌ రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. ఇందులో రూ.10 లక్షల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు అయన తెలిపారు. మిగిలిన రూ.10 లక్షలను సహాయక వస్తువుల రూపేనా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా రూ.1.01 కోట్లు విరాళం ప్రకటించింది.

Tags:    

Similar News