Mahesh Babu: జనతా కర్ఫ్యూ పై అభిమానులకి మహేష్ పిలుపు

కరోనా ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

Update: 2020-03-21 06:45 GMT
superstar Mahesh babu

కరోనా ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా భారత ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. అయితే జనతా కర్ఫ్యూకు ఇప్పుడు మంచి స్పందన లభిస్తోంది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని సెలబ్రిటీలు సైతం తమ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..జనతా కర్ఫ్యూను ప్రతి ఒక్కరు పాటించాలని తద్వారా కరోనా వైరస్ ని అరికట్టేందుకు తోడ్పడాలని కోరుతున్నారు.

అందులో భాగంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా జనతా కర్ఫ్యూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. " మనల్ని రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన ధైర్యశీలులకు సెల్యూట్ చేద్దాం.. ఆదివారం సాయంత్రం 5 గంటలకు బాల్కనీల్లో నిల్చుని మనం కొట్టే చప్పట్లు ప్రతిధ్వనించాలి.. అదే మనం వారికిచ్చే గౌరవం, చప్పట్ల శబ్ధంలో అవి కనిపించాలి ' అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా.. రేపు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ప్రధాని పిలుపును అందరూ పాటించాలని, ప్రతి ఒక్కరు జనతా కర్ఫ్యూలో భాగస్వాములు కావాలని అభిమానులను కోరుతూ.. మహేష్ మరో ట్వీట్ చేశారు.

ఇక కరోనా వైరస్ ప్రభావం వలన ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇక భారత్ లో కూడా 170 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. అయిదు మరణాల సంభవించాయి. వైరస్ ప్రభావితం ఎక్కువ కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే స్కూల్స్, ధియేటర్స్, పబ్బులు, స్విమ్మింగ్ ఫూల్స్ మొదలగు వాటిని మార్చి 31 వరకు రద్దు చేశాయి. అంతేకాకుండా వ్యక్తిగత శుభ్రత అన్నిటికంటే ముఖ్యమని చెబుతున్నాయి.  


Tags:    

Similar News